ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి హాజరుకావాలంటూ ఆయనకు అధికారులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో గతంలో విజయసాయి రెడ్డి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజా విచారణకు ముందుగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకం
“కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన…”
ట్వీట్ చేస్తూ,
“కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు. కానీ వాటి ఫలితాలపై కాదు. నీవు కర్మఫలాలకు కారణం కాకూడదు. అలాగే కర్మలు చేయకుండా ఉండకూడదు” అంటూ అర్థాన్ని కూడా వివరించారు.
ఈ శ్లోకాన్ని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం వెనుక ఆయన భావోద్వేగం ఏంటన్నదిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. విచారణ మధ్యలో ఇలాంటి ట్వీట్ చేయడం పలు వ్యాఖ్యలకు దారి తీస్తోంది.
Read More : మున్సిపల్ పాఠశాల ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్

2 thoughts on “లిక్కర్ స్కామ్: సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి”
Comments are closed.