ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ

JanaReddy

జానారెడ్డి భేటీ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

తాజాగా జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జానారెడ్డి కూడా ప్రభుత్వం అడిగితే సలహాలు ఇవ్వడానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు పదవి ఆఫర్ చేయడానికే ఆయన నివాసానికి వెళ్లారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలతో ఈ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More