హైదరాబాద్‌లో ఇప్పటికే 200 అమెరికా కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణలో నిర్వహించిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, అమెరికాకు స్వాతంత్ర్యం లభించిన తర్వాత ప్రపంచ దిశ మలిచిపోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి, అమెరికాకు మధ్య వాణిజ్య, సాంకేతిక సంబంధాలు మరింత బలపడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు అమెరికా సహకారం అవసరమని తెలిపారు.
అంతేకాకుండా, అమెరికాలో తెలుగు ప్రజల బంధం సుదీర్ఘంగా కొనసాగుతుందనీ, అక్కడ తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ బంధాన్ని మరింత బలపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని హామీ ఇచ్చారు.
Read More : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

One thought on “అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి”
Comments are closed.