తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్మితమైన అత్యాధునిక ఏఐజీ హాస్పిటల్‌ను అధికారికంగా ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, ఆంకాలజీ, కార్డియాక్ సైన్సెస్ తదితర ఎనిమిది కీలక విభాగాలలో అత్యాధునిక వైద్య సేవలు అందించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ రాష్ట్రానికి ఓ పెద్ద సంపాద్యమని, ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More : ఫిరోజ్ ఖాన్‌పై మహిళా కమిషన్ సీరియస్

One thought on “CM : హైదరాబాద్‌లో ఏఐజీ హాస్పిటల్ ప్రారంభం”
Comments are closed.