వరంగల్ కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం దృష్టి: కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వలన వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కల నిజం కాబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, పీవీ నరసింహారావు హయాంలోనే ఈ ఫ్యాక్టరీపై వాదనలు మొదలైయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం వరంగల్‌లో ఏర్పాటవుతున్న రైలు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (RMU) 60% వరకు పనులు పూర్తయ్యాయని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు.

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ఈ యూనిట్ పనులను పరిశీలించనున్నట్టు చెప్పారు. మొదటగా రైలు ఇంజిన్ తయారీ మొదలుపెట్టాలని కేంద్రం యోచనలో ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 200 కోట్లతో ప్రారంభమై మరో 200 కోట్లు అదనంగా ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల సుమారు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెప్పారు.

అభివృద్ధిపై కేసీఆర్ నిర్లక్ష్యం

హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ గత ప్రభుత్వాలు హైదరాబాద్ చుట్టూ మాత్రమే అభివృద్ధి చర్యలు తీసుకున్నాయని విమర్శించారు. వరంగల్ విమానాశ్రయానికి భూములు ఇవ్వాలన్న డిమాండ్‌పై కేసీఆర్ స్పందించలేదని తెలిపారు.

ఎంఎంటీఎస్, రైల్వే అభివృద్ధి

యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ విస్తరిస్తున్నట్టు వెల్లడించారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ జనవరిలో భక్తులకు అంకితం చేస్తామని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 2025లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి తెచ్చామన్నారు.

జలవివాదంపై స్పష్టం

ఏపీ-తెలంగాణ మధ్య జలవివాదాల పరిష్కారం కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోందని, రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలన్నదే ఉద్దేశమన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధానం, ఇప్పుడు మరో విధానం అవలంబిస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గోదావరి జలాల వినియోగంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించలేదని అన్నారు.

రిజర్వేషన్లపై భిన్న దృష్టి

బీసీ ముస్లింల పేరుతో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లు కాకుండా, బీసీలకే పూర్తి రిజర్వేషన్లు ఇవ్వాలని బీజేపీ విధానం స్పష్టం చేస్తోందని చెప్పారు. బ్రిటిష్ కాలంనాటి రిజర్వేషన్లతో నేటి పరిస్థితులను పోల్చడం తగదన్నారు.

కేంద్రం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలను గౌరవించకుండా, విమర్శలు చేయడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ధోరణి అని మండిపడ్డారు.

Read More : డిప్యూటీ సీఎం భట్టి మాళ్లు కీలక వ్యాఖ్యలు

One thought on “వరంగల్ కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం దృష్టి: కిషన్ రెడ్డి

Comments are closed.