ఫిరోజ్ ఖాన్‌పై మహిళా కమిషన్ సీరియస్‌

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గత నెల 21న గాంధీ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఫిరోజ్ ఖాన్ మహిళల పట్ల అవమానకరంగా వ్యాఖ్యలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. ఆయన వ్యాఖ్యలు మహిళల పరువు, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్‌ను ఈ నెల 4వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని అధికారికంగా ఆదేశించింది. మహిళల పరిరక్షణలో భాగంగా ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది.

Read More : తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు మళ్లీ పెంపు దిశగా

One thought on “ఫిరోజ్ ఖాన్‌పై మహిళా కమిషన్ సీరియస్‌

Comments are closed.