రద్దీ సమయంలో సర్జ్ ఛార్జీలకు కేంద్రం అనుమతి

దేశంలో క్యాబ్ సేవలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో క్యాబ్ సంస్థలు బేసిక్ ఛార్జీలపై అదనంగా సర్జ్ ఛార్జీలు వసూలు చేయడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, నామమాత్రంగా రద్దీ ఉన్న సమయంలో బేస్ ఛార్జీలకు గరిష్ఠంగా 50 శాతం వరకూ అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే రద్దీ తీవ్రంగా ఉన్న సందర్భంలో ఈ సర్జ్ ఛార్జీని గరిష్ఠంగా 200 శాతం వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.

అయితే మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని స్పష్టమైన నిబంధనను కూడా కేంద్రం విధించింది. ఈ మార్గదర్శకాలు ప్రయాణికుల హక్కులను రక్షించేలా, సరసమైన ధరల నియంత్రణలో ఉండేలా రూపొందించామని అధికారులు తెలిపారు.

Read More : శంషాబాద్ విమానాశ్రయంలో వాతావరణ ప్రభావం

One thought on “రద్దీ సమయంలో సర్జ్ ఛార్జీలకు కేంద్రం అనుమతి

Comments are closed.