ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం పర్యటనలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, 10.40కు విశాఖ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 10.50 గంటలకు ఆర్కే బీచ్‌రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుని, అనంతరం పార్కు హోటల్ వరకూ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం 11.45 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి వెళ్లి అక్కడి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.05 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుని, 12.15 నుంచి 1.30 వరకు యోగా దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరి, 2.50 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు.
ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథి సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికే విశాఖ చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Read More : శ్రీహరికోట షార్‌లో తీవ్రవాదులు? భద్రతా బలగాల విస్తృత తనిఖీలు

One thought on “విశాఖ పర్యటనలో CM నాయుడు”
Comments are closed.