విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథ రెడ్డి కుమార్తె ఇ. జయశ్రీ నీట్ ప్రవేశ పరీక్షలో 95.86 శాతం మార్కులతో 471 మార్కులు సాధించి అందరిని ఆకట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి రోజా సెల్వమణి జయశ్రీని ప్రత్యేకంగా అభినందించారు.
భవిష్యత్తులో మెడిసిన్ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్న జయశ్రీకి పూర్తి తోడుగా నిలుస్తామని రోజా హామీ ఇచ్చారు. ఆమె మెడికల్ చదువుకు అవసరమైన అన్ని ఖర్చులు తామే భరిస్తామని తెలియజేశారు. రోజా చేసిన ఈ ఉదారమైన నిర్ణయం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.
అవసర సమయంలో చదువులో ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థినికి అండగా నిలవడమంటే ఇదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read More : విశాఖ పర్యటనలో CM నాయుడు

One thought on “మంచి మనసు చాటుకున్న మాజీ మంత్రి రోజా”
Comments are closed.