అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులను గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నర్సులు నిస్వార్దంగా అందించే సేవలు వెలకట్టలేనివి. బాధితుల ప్రాణాలను రక్షిస్తూ వారు చూపే కృషి చిరస్మరణీయమని” ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా నర్సులను కలిసి సత్కరించి, వారి బాధ్యతను గుర్తుచేశారు.
Telangana :
ఈ సందర్భంగా తెలంగాణలోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని కోఠీ వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’లో అవసరమైతే సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు ప్రతిజ్ఞ చేశారు.
ఇక రవీంద్రభారతిలో తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకల్లో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, మంత్రి, కార్యదర్శులు పాల్గొననున్నారు. అసోసియేషన్ అధ్యక్షురాలు ఆది లక్ష్మి ఈ వేడుకల వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా నర్సుల సేవలను గుర్తించడమే కాకుండా, భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పలువురు నేతలు సూచించారు.
Read More : చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.
