రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దుమారం రేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై ఆయన హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన న్యాయవిచారణ కమిషన్ ఎదుట బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు బల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువును దెబ్బతీసేలా, ప్రభుత్వ ప్రతిష్ఠను కించపరచేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ఒక నేతను ఉద్దేశపూర్వకంగా కించపరచే ఈ విధమైన చర్యలు అనుచితమని, ఇవి రాష్ట్రంలో రాజకీయ వేడి పెంచే అవకాశం ఉందని బల్మూరి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు ఇలా వ్యవహరించడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని విమర్శించారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులు కోరారు. సైబర్ క్రైమ్ అధికారులు ఈ ఫిర్యాదును నమోదు చేసుకుని విచారణ ప్రారంభించనున్నారు.

Read More : తెలంగాణలో భారీ రియల్ ఎస్టేట్ మోసం

One thought on “రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్

Comments are closed.