నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇచ్చిన వారికి పదవులు కల్పిస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టారని, ఛార్జ్‌షీట్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లు కూడా ఛార్జ్ షీట్‌లో చేర్చబడ్డాయి. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) కు చెందిన రూ. 2000 కోట్ల ఆస్తులను కాజేయించేందుకు కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నేతృత్వంలో యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
2019 నుంచి 2022 మధ్య యంగ్ ఇండియా సంస్థ కోసం విరాళాలు సేకరించి, వాటి ద్వారా పదవులు కల్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభపడ్డారని ఛార్జ్ షీట్‌లో వివరించింది. విచారణలో సాక్షుల వివరాల ఆధారంగా మాత్రమే రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్‌లో చేర్చినట్టు ఈడీ స్పష్టం చేసింది. సాక్షులు తెలిపారు, రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నేతల సూచనల మేరకు విరాళాలు అందించినట్లు వారు వెల్లడించారు.
Read More : కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ప్రతిస్పందన

One thought on “నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం, ఈడీ ఛార్జ్‌షీట్ విడుదల.”
Comments are closed.