ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి వైదొలిగి తన కుమారుడు నారా లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ సూచనలు చేశారు.
ఈ సభలో ప్రసంగించిన ఒవైసీ మాట్లాడుతూ, “చంద్రబాబు గారు… మీ తర్వాత ఎలాగైనా మీ కుమారుడే బాధ్యతలు స్వీకరిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం లేదు కదా? లోకేశ్‌ను గందరగోళంలో పడేసి ఆయన భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు గతంలో పనిచేసిన కాలాన్ని ప్రస్తావిస్తూ, “మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 సంవత్సరాలు, విభజిత రాష్ట్రానికి మరో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇది చాలును. ఇప్పుడు లోకేశ్‌ను ముందుకు నడిపించండి” అంటూ సూచించారు.
ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read More : YSRCP లీడర్ మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ

One thought on “చంద్రబాబు విరమించాలి: లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించండి”
Comments are closed.