ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, “ఈ కాంప్లెక్స్ భవిష్యత్ ఆశలకు వేదికగా మారబోతోంది. ఇది కేవలం పరిశ్రమ కాదు.. ఇది ఒక ఉద్యమం. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి ఇది శంకుస్థాపన,” అని పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ వివరాలు:
- తొలి దశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్ పవర్ ఏర్పాటుకావచ్చు.
- 100 శాతం మేడ్ ఇన్ ఇండియా సోలార్ ప్యానెల్స్ వినియోగిస్తారు.
- వాటర్‌లెస్ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా సోలార్ ప్యానెల్స్ శుభ్రపరిచే విధానాన్ని అనుసరించనున్నారు.
- ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది.
2030 నాటికి లక్ష్యం:
భారతదేశం 2030 నాటికి 500 GW నాన్-ఫాసిల్ ఇంధన లక్ష్యాన్ని సాధించాలన్న దిశగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. “ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం,” అని లోకేష్ స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్‌ను నేషనల్ లీడర్‌గా నిలబెట్టేందుకు ఇది కీలకమని చెప్పారు.
ఇండియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్:
ఇది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్. ఇందులో మొత్తం 1,800 మెగావాట్ల సోలార్, 2,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్లు వివిధ దశల్లో రెన్యూ సంస్థ ద్వారా ఏర్పాటు కానున్నాయి.
Read Mode : వాతావరణ శాఖ హెచ్చరిక

One thought on “Anantapur లో మినిస్టర్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ శంకుస్థాపన.”
Comments are closed.