వాతావరణ శాఖ హెచ్చరిక

వాతావరణ శాఖ అంచనాల మేరకు నైరుతీ రుతుపవనాలు అండమాన్ తీరం తాకగా, ఈ నెలాఖరులోపు కేరళకు చేరుకోనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

విజయవాడలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏపీని భారీ వర్షాలు, పిడుగులు, ఉరుములు వెంటాడుతున్నాయి. అమలాపురం, కాజులూరు, పితాపురం తదితర ప్రాంతాల్లో 30 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

రాయలసీమ, కోస్తాలో శుక్ర, శనివారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లుూరి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనుండగా, కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

తెలంగాణలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లో వర్షంతో రహదారులపై నీరు నిలిచిపోయింది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

గాలి వేగం 50 కి.మీ. వరకూ ఉంటుందని, ఉరుములు, మెరుపులు, పిడుగుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read Mode : బండ్ల గణేష్ ఆంధ్రప్రదేశ్ సీఎం ని కలిసిన సందడి