లిక్కర్ స్కాం సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను ధర్మాసనం నేరుగా తిరస్కరించింది. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు కూడా వీరి బెయిల్ అభ్యర్థనను తిరస్కరించగా, దానిని సవాల్ చేస్తూ వారు సుప్రీంకు వెళ్లారు. జస్టిస్ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణాధికారుల పనికి అంతరాయం కలుగుతుందని పేర్కొంది.

రూ.3,200 కోట్ల మద్యం ముడుపుల స్కాం – బాలాజీ గోవిందప్ప అరెస్ట్

ఈ కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు కర్ణాటకలో అరెస్ట్ చేశారు. మద్యం ముడుపులను షెల్ కంపెనీల్లోకి మళ్లించడంలో బాలాజీ పాత్ర కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై ఆధారాలు సేకరించారు. తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.3,200 కోట్ల మద్యం ముడుపులు చేరినట్లు ఆరోపణల నేపథ్యంలో బాలాజీ పేరును A33 నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఐదుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు.

జగన్ సన్నిహితుడిగా బాలాజీ పాత్ర

బాలాజీ గతంలో విజయసాయిరెడ్డితో పనిచేశారని, ఆయన ద్వారానే జగన్ కుటుంబానికి చేరువయ్యారని సమాచారం. అనంతరం భారతీ సిమెంట్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, లిక్కర్ స్కాంలో ప్రధాన ముళ్లగా మారారని అధికారులు పేర్కొన్నారు. ముడుపుల లావాదేవీలలోనూ అతని ప్రమేయం ఉందని వివరించారు.

Read Mode : రూ.22,000కోట్లతో నిర్మాణం ప్రారంభం