వివరణతో స్పందించిన మంత్రి

తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రులు డబ్బులు తీసుకుంటారని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యం

వ‌రంగ‌ల్‌ జిల్లాలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ మాట్లాడుతూ, “ఫైళ్ల క్లియరెన్స్ కోసం చాలామంది మంత్రులు డబ్బులు తీసుకుంటారని వింటాం. కానీ నేను మాత్రం ఒక పైసా కూడా అడగకుండా, పాఠశాలలు, సామాజిక సేవలు చేయాలని కంపెనీలను ప్రోత్సహిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ కంపెనీ రూ.4.5 కోట్లతో కళాశాల భవనం నిర్మించేందుకు ముందుకొచ్చిందని వెల్లడించారు.

ప్రతిపక్ష విమర్శలు – సురేఖ వివరణ

ఈ వ్యాఖ్యలపై విపక్షాలు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ మండిపడ్డాయి. దీనిపై మంత్రి కొండా సురేఖ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “నా వ్యాఖ్యలను కొందరు దురుద్దేశంతో వక్రీకరించారు. నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రుల వ్యవహారాలను ప్రస్తావించాను. కొత్త ప్రభుత్వానికి ఏమాత్రం అపవాదులు రావద్దన్న ఉద్దేశంతోనే మాట్లాడాను” అని తెలిపారు.

తన వ్యాఖ్యలపై త్వరలో వీడియో ద్వారా పూర్తి స్పష్టత ఇస్తానని కూడా చెప్పారు.

Read More : హైదరాబాద్‌లో రికవరీ ఏజెంట్‌పై కుక్కతో దాడి.

One thought on “వివరణతో స్పందించిన మంత్రి

Comments are closed.