హైదరాబాద్లో ‘మోక్ డ్రిల్’ నిర్వహణ:

ponnam prabhakar

భారతదేశం వ్యాప్తంగా బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ దాడిలో పాక్ ఉగ్రవాదుల చేతిలో 26 మంది అమాయక భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఖండింపబడింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో, యుద్ధం వస్తే రక్షణ చర్యలు ఎలా తీసుకోవాలో పరీక్షించేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా, హైదరాబాద్‌లో మాక్ డ్రిల్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. “ఈ రోజు (మే 7) సాయంత్రం 4:00 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, కంచన్ బాగ్, నానాల్‌నగర్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగుతుంది” అని ఆయన తెలిపారు. హైదరాబాదులోని కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

అనుమానాస్పద పరిస్థితులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే, దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. “హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో సైన్యంపై గర్వంగా ఉందని చెప్పారు. “జై హింద్” అని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అంతర్గత భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Read More : భారత సైన్యానికి మాజీ మంత్రి అభినందనలు

One thought on “హైదరాబాద్లో ‘మోక్ డ్రిల్’ నిర్వహణ:

Comments are closed.