ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR

భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ స్పందించారు.

“ఉగ్రవాదం ఏ రూపంలోనైనా, ఏ దేశంలోనైనా ప్రపంచ మానవాళికి అపారమైన నష్టం మాత్రమే కలిగించగలదు. అందుకే, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు.

“భారత సైన్యం తమ సైనిక పాటవాన్ని నిరూపించుకుంది. ఈ విజయంపై ఒక భారతీయుడిగా నాకు గర్వంగా ఉంది” అని కేసీఆర్ అన్నారు.

“ప్రపంచ శక్తులు ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించి, సమన్వయంతో ఉగ్రవాదాన్ని అంతం చేస్తే, ప్రపంచ శాంతి, సామరస్యాలు సాధ్యపడతాయి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

“భారత సైన్యం ఎంతో వీరోచితంగా దాడులు చేపట్టింది. దేశరక్షణలో ఎవరూ వెనుకాడకుండా సైన్యం మరింత శక్తివంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని కేసీఆర్ తెలిపారు.

Read More : హైదరాబాద్లో ‘మోక్ డ్రిల్’ నిర్వహణ:

One thought on “ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Comments are closed.