ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ‘వైబ్రాంట్స్ ఆఫ్ కలాం’ సంస్థ తయారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కలాం విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో, జూలై 27న కలాం వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి 13 జిల్లాల్లో విగ్రహ ఆవిష్కరణలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధి విజయ్ తెలిపారు. ఏపీ, తెలంగాణల్లో కలిపి మొత్తం 25 విగ్రహాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 20 అడుగుల విగ్రహాలుగా ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. యువతకు ప్రేరణనిచ్చే విధంగా ఈ విగ్రహాలు ఉంటాయని వివరించారు.
దేవాదాయ శాఖపై సీఎం సమీక్ష
ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆలయాల్లో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలపై చర్చించారు. భక్తులకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు, ఉత్సవాల సమయంలో రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుమల, సింహాచలం ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. సింహాచలం ఘటనకు సంబంధించి ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసారు.
Read More : సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ మోహన్ రిమాండ్ పొడిగింపు

One thought on “మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరణ”
Comments are closed.