హైటెన్షన్, తీగ తెగిపడి మంటలు

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ సమీపంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైటెన్షన్ విద్యుత్ తీగ అకస్మాత్తుగా తెగిపడటంతో సమీపంలో ఉన్న తుక్కు దుకాణంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ పొగలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

సమయస్ఫూర్తిగా స్పందించిన అగ్నిమాపక శాఖ మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించేందుకు యత్నిస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతానికి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

Read More : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరణ