మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కక్ష సాధింపు చర్యలు తగవని అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. జగన్ తప్పు చేస్తే జగన్‌ను శిక్షించాలి కానీ పోలీసులను జైలుకు పంపడం సరికాదన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్లో చాలామంది తనకు స్నేహితులుగా ఉన్నారని, డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు వెళ్లినప్పుడు చూడటానికి వెళ్లినట్లు తెలిపారు. డీజీ స్థాయి అధికారిని జైలుకు పంపిన ఘటన ఇదే మొదటిసారని అన్నారు.
ఏపీ పునర్విభజనపై పిటిషన్ – పవన్ కల్యాణ్ ఆశాజ్యోతి
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకముందే విభజన చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని విమర్శించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం సీనియర్ న్యాయవాదిని నియమించి దృష్టిని సుప్రీంకోర్టుపైకి మళ్లించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఆశాజ్యోతి అని అభివర్ణించారు. ఇప్పటికే పవన్‌కు ఈ అంశంపై లేఖ రాసినట్లు తెలిపారు.
ఉగ్రవాదంపై కేంద్రానికి మద్దతు – మత విద్వేషాలు వద్దు
ఉగ్రవాదంపై కేంద్రం తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాలని తెలిపారు. భారత్‌పై యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్‌కు లేదని, యుద్ధం జరిగితే పాకిస్తాన్‌కు నష్టం జరుగుతుందని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదని, భారతదేశంలో ముస్లింలు 12 శాతం ఉన్నప్పటికీ పాకిస్తాన్లో హిందువులు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ముస్లింలపై వ్యతిరేకత సృష్టించకుండా, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దృక్పథం ఉండాలని సూచించారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని చెప్పారు.
Read More : రైతుల కోసం మరో మంచి నిర్ణయం

One thought on “ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి”
Comments are closed.