తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు ఈరోజు (సోమవారం) సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. నటి కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు వేసి అరెస్టు చేసి వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు మరియు దిగువ స్థాయి పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందడంతో అరెస్టు నుంచి ఉపశమనం పొందారు. అయితే, ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేసి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు.
తాజాగా, సీఐడీ అధికారులు విశాల్ గున్నీ, కాంతిరాణా తాతాకు విచారణ కోసం నోటీసులు జారీ చేసి, వారు ఈ రోజు విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు.
Read More : తిరుమల :ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి!
