జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి వెనుక పాకిస్థాన్ ప్రత్యేక శిక్షణ ఉందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) నుండి కఠినమైన శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి ఈ దాడులకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల విచారణలో ఈ సమాచారం బయటపడింది. దాడిలో పాల్గొన్న హషీం మూసా అనే ఉగ్రవాది గతంలో పాకిస్థాన్ SSGలో పారాకమాండోగా పనిచేశాడని, అనంతరం లష్కరే తోయిబాలో చేరి పలు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.
2023లో భారత్‌లోకి ప్రవేశించిన హషీం మూసా.. గందర్‌బల్ దాడిలో 7 మంది మరణానికి, బారాముల్లాలో నలుగురు భద్రతా సిబ్బంది హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి దక్షిణ కశ్మీర్‌లోని అడవుల్లో అతను తలదాచుకుని ఉన్నాడని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
మూసా కోసం భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అతడి ఆచూకీ తెలుపుతున్న వారికి ₹20 లక్షల బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
ఈ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ మళ్లీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందన్న ఆరోపణలు మళ్లీ పుంజుకున్నాయి.
Read More : చివరికి వ్యభిచారంలోకి దిగిన యువతి..

One thought on “హషీం మూసా కోసం భద్రతా బలగాల ముమ్మర సెర్చ్ ఆపరేషన్”
Comments are closed.