తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా, ఎంత ఇబ్బందులకు గురి చేసినా, తాను గానీ, పార్టీ శ్రేణులు గానీ భయపడబోయే ప్రసక్తి లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, “గతంలో కాంగ్రెస్ హయాంలో నన్ను 16 నెలలు జైలులో ఉంచారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. అయినా ప్రజలు మా పార్టీకి అఖండ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా పరిస్థితి అదే. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ప్రజల నమ్మకం మన మీదే ఉంటుంది,” అని ధీమా వ్యక్తం చేశారు.
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పూర్తి మద్దతు ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. అదే తీరుతో, ఇప్పుడు కూడా ప్రజలు తప్పుడు కేసులను ఎదురించి పార్టీకి అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆంక్షలు వచ్చినా, రాజకీయ వేధింపులు ఎదురైనా, పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకు సాగాలని పీఏసీ సమావేశం ద్వారా జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి, చివరికి అది వైసీపీకి లాభంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
Read More : సాక్షుల వరుస మరణాలపై సిట్ దర్యాప్తు వేగవంతం

One thought on “జగన్ : తప్పుడు కేసులతో భయపడే ప్రసక్తి లేదు”
Comments are closed.