తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల ఆర్. సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన Siddayya కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం అందించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏనుగుల సంచారాన్ని నిరంతరం పరిశీలిస్తూ, సమీప గ్రామాలకు తక్షణ సమాచారం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రజలకు వన్యప్రాణుల నుంచి ప్రమాదాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Read More : జగన్ : తప్పుడు కేసులతో భయపడే ప్రసక్తి లేదు

One thought on “జిల్లాలో ఏనుగు దాడిలో వ్యక్తి మృతి”
Comments are closed.