హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ కేంద్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పహల్గామ్ దాడిపై తీవ్రంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన వంద మందికి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడి ఉగ్రవాద రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు. తుపాకీ ఎత్తినవాడు తాను తుపాకీ బలైపోవడం ఖాయం అని హెచ్చరించారు.
దాయాది దేశం పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించేలా భారత్ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Read More : మంత్రి కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు

One thought on “పహల్గామ్ ఘటనపై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది”
Comments are closed.