ప్రభాస్ సినిమా వల్లే ‘రెట్రో’ ఛాన్స్‌ దక్కింది: పూజా హెగ్డే

Pooja Hegde Retro movie

టాలీవుడ్‌ టాప్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన పూజా హెగ్డే ఒక్కసారిగా అవకాశాలు కోల్పోయింది. తెలుగులో నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఆమెకు స్టార్‌ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన పూజా అక్కడ కూడా పెద్దగా విజయాలను నమోదు చేయలేకపోయినా, వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన రెట్రో అనే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. టీజర్‌, పోస్టర్లు, ప్రమోషన్ వీడియోల్లో పూజా హెగ్డే ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ బజ్‌ రావడం విశేషం. మే 1న విడుదలవుతున్న ఈ చిత్రంపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ, ఈ చిత్రం తనను విభిన్నంగా చూపించబోతుందనీ, ఇందులో యాక్షన్‌, ఎమోషన్‌, డాన్స్‌ అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయని చెప్పింది. ముఖ్యంగా మేకప్‌ లేకుండా నటించే అవకాశం రావడం తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ‘రాధేశ్యామ్’లో తన నటనను చూసిన కార్తీక్ సుబ్బరాజే ఈ సినిమాకు ఎంపిక చేశారని పూజా పేర్కొంది.

తమిళంలో ఇది తన తొలి చిత్రం కావడంతో చాలా ప్రత్యేకంగా భావిస్తున్నానని, ఇకపై మంచి కథలే ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తానని పూజా స్పష్టం చేసింది. టాలీవుడ్‌లో ఆమె రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read More

One thought on “ప్రభాస్ సినిమా వల్లే ‘రెట్రో’ ఛాన్స్‌ దక్కింది: పూజా హెగ్డే

Comments are closed.