కీర్తి సురేష్ గిబ్లి స్టైల్ ఏఐ ఫోటోలు వైరల్

Keerthy Suresh AI Pictures

ఇటీవలి కాలంలో ఏఐ టూల్స్ ఇంటర్నెట్‌ను ఆకర్షిస్తూ సంచలనంగా మారాయి. చాట్‌జీపీటీ, గ్రోక్ వంటి ఎన్నో ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడం, వాటి వినియోగంతో వినియోగదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ టూల్స్‌లో గిబ్లి ఫోటో మేకింగ్ ఫీచర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు గిబ్లి ఫోటోల కోసం పోటీ పడుతున్నారు. కొన్ని ఫోటోలు అసలు గుర్తుపట్టలేనంత వింతగా కనిపిస్తుంటే, మరికొన్ని చాలా సహజంగా ఉంటాయి.

తాజాగా, కీర్తి సురేష్ తన గిబ్లి స్టైల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె “షూటింగ్ డే” అంటూ చేసిన ఈ ఆర్టిస్టిక్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫోటోలలో కీర్తి సురేష్ క్యూట్ లుక్‌లో మెరిసిపోతుంటే, కొన్ని చిత్రాలు ఆమెకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అభిమానులు ఈ ఫోటోలను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇటీవల వెబ్ సిరీస్‌లలో బిజీగా ఉన్న కీర్తి సురేష్, తమిళ సినిమాలతో పాటు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తెలుగులో దసరా తర్వాత పెద్దగా సినిమాలు చేయకపోయినా, రీ-ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏఐ టూల్‌తో కీర్తి సురేష్ పిక్చర్స్ మరింత ట్రెండ్‌లో నిలిచాయి.


Read More

One thought on “కీర్తి సురేష్ గిబ్లి స్టైల్ ఏఐ ఫోటోలు వైరల్

Comments are closed.