సమంత ప్రొడక్షన్ నుంచి ‘శుభం’… ట్రైలర్‌కు గ్రీన్ సిగ్నల్!

Samantha Shubham trailer

క్రేజీ హీరోయిన్ సమంత తొలిసారి నిర్మాతగా మారిన థ్రిల్లర్ చిత్రం శుభం ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. వివిధ పాత్రల్లో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం నటించగా, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ప్రేక్షకులలో ఆసక్తి పెంచింది.

‘మీకు శుభం కలుగుగాక’ అన్న ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ ఎప్పుడైనా విడుదల కావచ్చని చెప్పేలా ఒక స్పెషల్ పోస్టర్‌ను సమంత సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

విభిన్నమైన కథా నేపథ్యంతో దాదాపు కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్, సినిమా ప్రచారంలో భాగంగా టీమ్ ప్రమోషన్స్‌కు స్పీడ్ పెంచింది.

ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే చిత్రంతో పాటు రాజ్ & డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ లో నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో సమంత క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, నటిగా కొనసాగుతోంది.

Read More



One thought on “సమంత ప్రొడక్షన్ నుంచి ‘శుభం’… ట్రైలర్‌కు గ్రీన్ సిగ్నల్!

Comments are closed.