విభిన్న కంటెంట్‌తో విజయవంతంగా సినిమాలు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ఓ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ను లాంఛనంగా ప్రారంభించింది. ఈ సినిమాలో హ్యాండ్సమ్ హీరో గోపిచంద్ హీరోగా నటించనుండగా, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సాహసం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ కొత్త సినిమాకు కుమార్ సాయి అనే యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే ఆయనకు తొలి సినిమా కావడం విశేషం. సాహసం సినిమాకు పనిచేసిన కెమెరామెన్ షామ్‌దత్ ఈ చిత్రానికీ పనిచేయనున్నారు. ప్రారంభోత్సవం ఇటీవల పూజా కార్యక్రమాలతో జరగ్గా, త్వరలో పూర్తి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

గోపిచంద్ సరసన మలయాళ నటిమణి మీనాక్షి దినేశ్ కథానాయికగా ఎంపికయ్యారు. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ డైలాగ్స్, మిస్టరీ అంశాలు ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇది గోపిచంద్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ కావొచ్చని అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం గోపిచంద్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా, రాధాకృష్ణతో కూడా మరో ప్రాజెక్ట్ చర్చల్లో ఉంది. వరుస ప్రాజెక్టులతో గోపిచంద్ మళ్లీ కమర్షియల్ ట్రాక్‌లోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. ‘సాహసం’ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ కొత్త చిత్రం ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

One thought on “యాక్షన్, మిస్టరీ, మాస్… గోపిచంద్ కొత్త సినిమా స్టార్ట్!”
Comments are closed.