జాక్ మూవీ హిట్ కన్ఫర్మ్.. బూతులపై సిద్ధు బోల్డ్ క్లారిటీ!

Siddu Jonnalagadda Jack Movie

టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన సిద్ధు జొన్నలగడ్డ, తన యూనిక్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలో టిల్లు స్క్వేర్ చిత్రంతో హిట్ కొట్టిన సిద్ధు, ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “జాక్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మీడియాతో మాట్లాడిన సిద్ధు, జాక్ పూర్తిగా భాస్కర్ గారి ఆలోచనల ఫలమని, ఇది ఆయన సిగ్నేచర్ స్టైల్ మూవీ అని తెలిపారు.

సినిమాలో యాక్షన్, థ్రిల్లింగ్, కామెడీ, ప్రేమకథ – అన్నింటినీ సమపాళ్లలో మిళితం చేశామని, మొదటి సీన్‌ నుంచి చివరి వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నామని చెప్పారు. టిల్లును ఆదరించిన విధంగా జాక్‌ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. “టిల్లును మర్చిపోలేరు అనొచ్చు, కానీ జాక్‌ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాడు” అంటూ సినిమా పట్ల ఉన్న నమ్మకాన్ని పంచుకున్నారు. కొన్ని సీన్లు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని కూడా హింట్ ఇచ్చారు.

ట్రైలర్‌లో కనిపించిన బూతు పదాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన సిద్ధు – “సన్నివేశాలకి అవసరమైన చోటే బూతులు వాడాం. హీరో పాత్రకు కోపం వచ్చే సందర్భాల్లో అవి సహజంగా వచ్చాయి. పీక్ క్లైమాక్స్ లో అయితే ఆ డైలాగ్స్ మరింత బలంగా మారాయి” అని తెలిపారు. సినిమా సెన్సార్ పూర్తయ్యే దశలో ఉందని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ సినిమాను నిర్మించగా, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. మేకర్స్ ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉండగా, మరో వారం రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Read More

One thought on “జాక్ మూవీ హిట్ కన్ఫర్మ్.. బూతులపై సిద్ధు బోల్డ్ క్లారిటీ!

Comments are closed.