నిద్రలేమి ఆరోగ్యానికి హానికరమన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే ఎక్కువ నిద్ర కూడా సరిఅయినది కాదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రోజుకు 10 గంటలకుపైగా నిద్రపోతే బాడీ మాస్ ఇండెక్స్ (BMI) పెరిగే అవకాశముందని తాజా పరిశోధనల్లో తేలింది. అంటే నిద్రను సమంగా, పరిమితంగా ఉండేలా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట.
సహజ వెలుతురు ముఖ్యం
ఉదయం నిద్రలేచిన వెంటనే సహజంగా వెలుగును పొందడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పడకగదిలో చీకటి ఉన్నట్లయితే శరీర జీవ గడియారం సక్రమంగా పని చేయదని హెచ్చరిస్తున్నారు. కిటికీలు తెరిచి సూర్యరశ్మిని శరీరానికి తాకేలా చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు సమతుల్యం అవుతాయి.
పడకను శుభ్రంగా ఉంచాలి
రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం లేవగానే పడకను శుభ్రంగా సర్దుకోవడం, దుప్పట్లు మడత పెట్టడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణుల సూచన. ఇలాంటివి మనలో ఒక క్రమశిక్షణను పెంపొందిస్తాయి. దీంతో నిద్ర సమయానికి వచ్చే అవకాశం పెరుగుతుంది. అదే విధంగా ఉదయం చురుగ్గా మేలుకోవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్ మిస్ అవ్వకండి
ఉదయ భోజనం (బ్రేక్‌ఫాస్ట్)ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదు. దీన్ని తీసుకోకపోతే మధ్యాహ్నం అనవసరంగా ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. ఇది అధిక బరువు సమస్యకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌లో పిండిపదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు సమతుల్యంగా ఉండాలి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు బరువు నియంత్రణలో కూడా సహాయపడతాయి.
Read More : ఫ్యాటీ లివర్ సమస్య యువతలో వేగంగా వ్యాపిస్తోంది..

One thought on “నిద్ర పరిమితి పాటించకపోతే బరువు పెరిగే ప్రమాదం!”
Comments are closed.