హైదరాబాద్‌లో ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాహారం తినడం ఓ కుటుంబానికి దుర్ఘటనగా మారింది. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివసించే శ్రీనివాస్ యాదవ్ (46) మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, ఫలక్‌నుమా డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ యాదవ్ భార్య రజిత (38), కుమార్తెలు జస్మిత (15), లహరి (17), తల్లి గౌరమ్మ (65)తో కలిసి నివసిస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆయన ఇంటికి రజిత సోదరుడు సంతోష్ కుమార్ (39), భార్య రాధిక (34), కుమార్తెలు పూర్వీక (12), క్రితగ్న (7) వచ్చారు. ఆదివారం చికెన్, మటన్, బోటి వండుకొని 9 మంది కలిసి భోజనం చేశారు. మిగిలిన మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, సోమవారం మళ్లీ వేడి చేసుకుని తిన్నారు. అనంతరం కుటుంబ సభ్యులందరికీ వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి.
అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, మంగళవారం ఉదయం శ్రీనివాస్ యాదవ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఫ్రిజ్‌లో ఎక్కువసేపు నిల్వ చేసిన మాంసాహారం తినడం వలన ఆహారవిషబాధే కారణమై ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.
read More : రేవంత్ రెడ్డి ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ : Kavitha

One thought on “ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాహారం తిని విషాదం”
Comments are closed.