వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనపై విధించిన సస్పెన్షన్ నిర్ణయంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. మంగళవారం రాత్రి పార్టీ ప్రకటించిన సస్పెన్షన్ ఆదేశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇన్నాళ్లు తనకు గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, తాను ఎప్పుడూ ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపి తనను బలిపశువుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సస్పెన్షన్‌ను తాత్కాలిక రాజకీయ విరామంగా తీసుకుంటానని పేర్కొన్నారు. తటస్థంగా ఉండి, తనను నమ్మిన అభిమానుల కోసమే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ‘‘అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది,’’ అని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

సస్పెన్షన్ వెనుక విమర్శలు
వైఎస్సార్‌సీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీ శాసనమండలి సభ్యుడైన దువ్వాడ శ్రీనివాస్‌ను క్రమశిక్షణ ఉల్లంఘన పేరుతో సస్పెండ్ చేయడం చర్చకు దారితీసింది.

తాజా సమాచారం ప్రకారం, దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం సంబంధిత వివాదాలు, ఒక మహిళ మాధురితో సంబంధాలు, సోషల్ మీడియాలో వైరలైన వీడియోలు, ఫోటోలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో పార్టీ తీవ్ర చర్యలు తీసుకుంది.

లోకేష్‌ను పొగడటమే కారణమా?
ఇక మరోవైపు, దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో… ‘బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరు?’ అనే ప్రశ్నకు ఇద్దరూ కలసి “లోకేష్” అని సమాధానం ఇచ్చారు. లోకేష్ తెలివైన నాయకుడు, సీఎం అయితే అభివృద్ధి చేయగలడని ప్రశంసించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలే ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయనే దృష్టితో వైఎస్సార్‌సీపీ అధిష్టానం స్పందించి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Read More : కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

One thought on “వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందన

Comments are closed.