గ్రూప్-1 ఫలితాల వివాదంలో బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక మండలి (TGPSC) తీవ్రంగా స్పందించింది. తమపై నిరాధార ఆరోపణలు చేసినందుకు సంబంధించి పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది.
రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మూర్తిమత్వాన్ని, సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని, వారం రోజుల్లోగా ఈ వ్యాఖ్యలపై స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో పాటు, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని TGPSC నోటీసులో స్పష్టం చేసింది.
అదే విధంగా, గడువు లోపు స్పందించకపోతే పరువునష్టం కేసులతో పాటు ఇతర క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయని హెచ్చరించింది. ఇకపై తమపై తప్పుడు ఆరోపణలు చేయరాదని, సోషల్ మీడియా వేదికలపై సంబంధిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో పేర్కొంది.
Read More : వరంగల్‌లో మేగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్

One thought on “గ్రూప్-1 ఫలితాల వివాదం : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం నోటీసులు!”
Comments are closed.