అమెరికా నార్త్ కరోలినాలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న తెలుగు ఎన్ఆర్ఐ పెళ్లి చేసుకునేందుకు మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీ సైట్‌ను ఉపయోగించాడు. 2023లో, మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన బర్కా జైస్వానీ అనే పేరుతో ఒక యువతి అతనితో పరిచయం అయ్యింది. కొంతకాలం మాట్లాడిన తర్వాత ఆమె వాట్సాప్‌లోనూ నెమ్మదిగా టచ్‌లోకి వచ్చి, తన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, విదేశీయానం వంటి కారణాలను చెప్పి, తన దగ్గర నుచి ఇంస్టాల్మెంట్స్ లో రూ.2.68 కోట్లు తీసుకుంది.
డబ్బులు కొట్టేసిన తర్వాత, ఇటీవల ఆ యువకుడు ఆమెకు వీడియో కాల్ చేసినప్పుడు, మ్యాట్రిమోనీ ప్రొఫైల్‌లో ఉన్న యువతితో పోల్చితే ఆమె భిన్నంగా కనిపించింది. ఈ వివరణకు సంబంధించిన అస్పష్టత కోసం ఆమెను ప్రశ్నించగా, ఆమె ఇచ్చిన సమాధానాలు కూడా అనుమానాస్పదంగా మారడంతో, ఆ యువకుడు అమెరికా నుండి ఇండోర్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు దర్యాప్తు చేస్తే, ఆమె అసలు పేరు సిమ్రన్ అని, ఆమెకు ఇప్పటికే పెళ్లయిన విషయం బయటపడింది. సిమ్రన్ తన సోదరుడు విశాల్‌తో కలిసి ఈ మోసం చేయడం, డబ్బు తీసుకుని అప్పులు తీర్చడం, కొత్త కార్లు కొనడం జరుగింది.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More : నెల్లూరు జిల్లా అనంతపురంలో అమోనియా గ్యాస్ లీక్.

2 thoughts on “మోడల్ ఫొటోతో తెలుగు ఎన్ఆర్ఐకి బురిడీ కొట్టించి రూ.2.68 కోట్లు కొట్టేసిన అన్నాచెల్లెళ్లు”
Comments are closed.