లిక్కర్ కేసుపై గవర్నర్‌ను కలవనున్న జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల రాష్ట్రంలో లిక్కర్ కేసు సంబంధంగా జరుగుతున్న వరుస అరెస్టుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సమాచారం ప్రకారం, జగన్ ఈ సందర్భంగా లిక్కర్ కేసులో జరుగుతున్న విచారణ, అరెస్టులపై తన ఆందోళనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ కేసులో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి వెనుక రాజకీయ ఉద్దేశ్యాలున్నాయా అన్న అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల లిక్కర్ కేసు అంశంపై రాష్ట్రంలో రాజకీయ వేడి చెలరేగిన నేపథ్యంలో జగన్-గవర్నర్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

Read More : జగన్‌పై దాడి నిందితుడు సతీశ్‌ ఆచూకీ లభ్యం