తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీసీల హక్కుల కోసం నిర్వహించిన ధర్నాకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పందన లేదని ఎద్దేవా చేశారు.
“రేవంత్ ధర్నా పెడితే రాహుల్ గాంధీ రాలేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ తెల్లవారితే భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడిని పిలిచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు కూడా తెరచడం లేదు” అని హరీష్ రావు విమర్శించారు.
ఇలాంటి వ్యవహారాలతో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బహిరంగంగా కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Read More : అహ్మదాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

One thought on “ఢిల్లీలో బీసీ ధర్నాపై హరీష్ రావు ఘాటుగా”
Comments are closed.