చీకటిలో మెరిసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్!

Pooja Hegde viral photos

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మధ్య తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదు. రాధేశ్యామ్, ఆచార్య, ఎఫ్3 వంటి సినిమాల తర్వాత ఈమె తెలుగులో ప్రాజెక్టుల సంఖ్య తగ్గిపోయింది. గతేడాది ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేకపోయిన పూజా ప్రస్తుతం తన కెరీర్‌ను బాలీవుడ్, కోలీవుడ్‌లవైపు మళ్లించింది. బాలీవుడ్‌లో ‘దేవా’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులపై బాగా దృష్టి సారించింది.

తమిళంలో సూర్యతో కలిసి చేస్తున్న ‘రెట్రో’ సినిమా చుట్టూ మంచి బజ్ నెలకొంది. అలాగే రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కించుకోవడంతో పూజా హెగ్డే మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది. నటనతో పాటు గ్లామర్ షోలో ఎప్పటికప్పుడు నిలిచే పూజా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను మెయింటేన్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 28 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉంది.

తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన డార్క్ షేడ్స్‌లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చీకటిలో లైట్ వెలుతురులో మెరిసిపోతూ, కవ్వించే లుక్స్‌తో స్టన్నింగ్‌గా కనిపించిన ఆమె ఈ ఫోటోలకు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్లు “ఫోటోలలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంది” అంటూ కామెంట్లు చేస్తుండగా, పూజా ఈ ఫోటోలతో మళ్లీ వైరల్ అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాలు లేనప్పటికీ, త్వరలోనే మళ్లీ తెలుగు తెరపై దర్శనమివ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Read More

One thought on “చీకటిలో మెరిసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్!

Comments are closed.