ఆక్సిజన్ ప్లాంట్ వద్ద మద్యం సేవించిన వార్డ్ బాయ్ పట్టుబాటు..

నగరంలోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్‌లో ఓ తీవ్ర నిర్లక్ష్య ఘటన వెలుగుచూసింది. ఆసుపత్రిలో ప్రాణాలకు కీలకమైన ఆక్సిజన్ ప్లాంట్ వద్ద విధి నిర్వహణలో ఉండే సమయంలో ఓ వార్డ్ బాయ్ మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు.

ఈ దృశ్యాలు బయటకు రావడంతో రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రాణాలు ఆధారపడే స్థలంలో ఇలాంటి అనాగరిక చర్యలు ఎలా సహిస్తారు?” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై హాస్పిటల్ అధికారులు విచారణ ప్రారంభించగా, సంబంధిత వార్డ్ బాయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More : ఢిల్లీలో బీసీ ధర్నాపై హరీష్ రావు ఘాటుగా

One thought on “ఆక్సిజన్ ప్లాంట్ వద్ద మద్యం సేవించిన వార్డ్ బాయ్ పట్టుబాటు..

Comments are closed.