అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై టెస్లా సీఈఓ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ స్పందించినట్లు సమాచారం. చైనా అంశంలో కొనసాగుతున్న టారిఫ్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, ఇలాంటి ఆంక్షలు కొనసాగితే అమెరికాకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రంప్‌కు మస్క్ సూచించినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఇద్దరి మధ్య జరిగిన భేటీలో ఈ అంశంపై మస్క్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. చైనాపై అమలు చేస్తున్న దిగుమతి సుంకాలపై మరోసారి పునఃసమీక్షన చేయాలని మస్క్ కోరినట్టు ఈ కథనాల్లో వివరించారు.
అయితే ట్రంప్ మాత్రం తన విధానంపై ఎలాంటి మార్పు అవసరం లేదని స్పష్టంగా తెలిపినట్టు సమాచారం. టారిఫ్‌ల విషయంలో తగ్గేదేలేదని, అమెరికా ప్రయోజనాల కోసం ఇవి తప్పనిసరి అని ట్రంప్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read More : అమెరికా వ్యాప్తంగా ట్రంప్ నిర్ణయాలపై భారీ నిరసనలు..

One thought on “టారిఫ్‌లపై ట్రంప్‌తో మస్క్ భేటీ – తగ్గేదేలేదని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు..”
Comments are closed.