పుతిన్‌పై ట్రంప్ ఆగ్రహం: ఉక్రెయిన్ దాడులపై తీవ్ర హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే, మరోవైపు ఉక్రెయిన్ పై దాడులు కొనసాగించడం ద్వంద్వ వైఖరని విమర్శించారు. ముఖ్యంగా, ఉక్రెయిన్‌లోని అమెరికాకు చెందిన ఫ్యాక్టరీపై రష్యా డ్రోన్ దాడులు జరిపిన ఘటనపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఇటీవల మద్దతుగా ముందుకొచ్చారు. మొదట పుతిన్‌తో, తరువాత జెలెన్‌స్కీతో సమావేశమై యుద్ధాన్ని ముగించాలని నచ్చజెప్పారు. శాంతి చర్చల కోసం త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ట్రంప్ స్వయంగా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సమావేశాల తర్వాత పుతిన్, జెలెన్‌స్కీలు కూడా శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ట్రంప్ కృషిని కీర్తిస్తూ, యుద్ధం ముగియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అదే సమయంలో పుతిన్ ఉక్రెయిన్ భూభాగంపై మరోమారు భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేయడం అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగించింది.

ఈ పరిణామంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, రెండు వారాల్లో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా, ఉక్రెయిన్ దేశాలపై ఆంక్షలు, భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అంతేకాకుండా, పుతిన్-జెలెన్‌స్కీల మధ్య చర్చలు “ఆయిల్-వినిగర్ కలపడం” లాంటివేనని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వారిద్దరి మధ్య చర్చల్లో తాను పాల్గొంటానో లేదో అనిశ్చితి వ్యక్తం చేశారు.

Read More : శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్

One thought on “పుతిన్‌పై ట్రంప్ ఆగ్రహం: ఉక్రెయిన్ దాడులపై తీవ్ర హెచ్చరిక

Comments are closed.