ఆండ్రియా స్టేజ్ షో వైరల్ – నాటి నటి ఇప్పుడు స్టార్ పెర్ఫార్మర్!

Andrea Jeremiah dance and singing performance

గానం అంటే గళం.. నృత్యం అంటే నడిక. ఈ రెండింటినీ సమపాళ్లలో ఆవిష్కరించగల ప్రతిభ చాలా కొద్ది మందికే సిద్ధిస్తుంది. అలాంటి అరుదైన టాలెంట్ కలిగినవారిలో ఆండ్రియా జెరోమియా పేరు మొదట్లోనే ఉంటుంది. గాయనిగా, నటిగా, డ్యాన్సర్‌గా ఎంతో మందిని మెప్పించిన ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ, తాజాగా ఓ మెడికల్ కాలేజీ వేదికపై తన ప్రతిభను ప్రదర్శించి యువతను ఉర్రూతలూగించింది. ‘యుగానికి ఒక్కడు’, ‘మాస్టర్’ వంటి చిత్రాల్లో నటిగా ఆకట్టుకున్న ఆండ్రియా… తన గాత్రంతో గమ్మత్తుగా పాడుతూ, థై స్లిట్ డెనిమ్ డ్రెస్సులో స్టేజీపై డ్యాన్స్ చేసి అబ్బురపరిచింది.

తాజాగా సవిత మెడికల్ కాలేజ్ వార్షికోత్సవాల్లో ఆండ్రియా చేసిన పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేదికపై ఆమె పాడిన పాటలు, చేసిన డ్యాన్స్ స్టెప్పులు కాలేజీ యూత్‌ను ఫిదా చేశాయి. ఆ ఈవెంట్ అనంతరం, “అందమైన యువ వైద్యుల మధ్య ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది” అని ఆండ్రియా తెలిపింది. ఈ షో కోసం లక్షల్లో పారితోషికం తీసుకుందని టాక్. ఇటీవల ప్రేమాయణం, బ్రేకప్ వంటి వ్యక్తిగత జీవితంలోని అడ్డంకులను అధిగమించి, మళ్లీ కెరీర్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టిన ఆండ్రియా… నిజంగా ఇన్‌స్పిరేషన్.

ప్రస్తుతం ఆండ్రియా నాలుగైదు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. మిస్కిన్ దర్శకత్వంలో ‘పిసాసు 2’, కమలాకన్నన్ దర్శకత్వంలో ‘వట్టామ్’ తోపాటు ‘కా’, ‘మాలిగై’, ‘నో ఎంట్రీ’ వంటి చిత్రాలతో బిజీగా గడుపుతోంది. దినేష్ సెల్వరాజ్, బాబీ ఆంటోని దర్శకత్వాల్లో ఆమె నటిస్తున్న ప్రాజెక్టులు కూడా సెట్స్‌పై ఉన్నాయి. సినిమాలతో పాటు ఇలా స్టేజ్ షోలలోనూ తళుక్కుమంటూ సందడి చేస్తుండటంతో ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకుంటోంది.

Read More

One thought on “ఆండ్రియా స్టేజ్ షో వైరల్ – నాటి నటి ఇప్పుడు స్టార్ పెర్ఫార్మర్!

Comments are closed.