టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాక్’ విడుదలకు రెడీ అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో మూవీపై హైప్ ఏర్పడింది. ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఒక అవాంఛిత సమస్యతో వార్తల్లో నిలిచింది.
అప్పట్లో అదే నిర్మాణ సంస్థ రూపొందించిన ‘గాండీవధారి అర్జున’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఆ సినిమా ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినా, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ చిత్రం కారణంగా కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల్లో పడ్డారు. అందులో భాగంగా గోదావరి జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే సినిమా ఛాంబర్‌ను ఆశ్రయించి, ‘రికవరబుల్ అడ్వాన్స్’ పేరిట వేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, అది పూర్తయ్యేవరకు ‘జాక్’ మూవీ విడుదల ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఫిర్యాదుతో చిత్ర విడుదలకు అడ్డంకులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఛాంబర్ ఈ విషయంలో సీరియస్‌గా ఉండటంతో నిర్మాతలు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. గోదావరి ఏరియాలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నా, అదే బాటలో ఇతర బయ్యర్లు కూడా వస్తే ‘జాక్’ విడుదలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మరి నిర్మాతలు ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించి సినిమాను సజావుగా విడుదల చేయగలరా? లేదంటే ఈ సమస్య పెద్దదవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

One thought on “గాండీవధారి అర్జున ప్రభావం… ‘జాక్’ రిలీజ్‌కు బ్రేకులు!”
Comments are closed.