“నన్ను మోసగించారు.. అప్ప‌ట్నుంచే ఆవేశం పెరిగింది” – మోహ‌న్ బాబు ఎమోష‌న‌ల్ జ‌ర్నీ

Mohan Babu on Kannappa movie

సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆయన భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో పాటు ఇందులో కీలక పాత్రలోనూ నటిస్తున్నారు. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్‌ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, అనివార్య కారణాలతో సినిమాను వాయిదా వేశారు.

ఇటీవలి పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో మోహన్ బాబు తన సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాల్యంలో సినిమా చూడటానికి నాలుగు కిలోమీటర్లు నడిచిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. 1975లో ‘స్వర్గం-నరకం’ సినిమాలో ఆయనకు తొలిచాన్స్ దక్కిందని, అప్పటి నుంచి ఇండస్ట్రీలో తన ప్రయాణం కొనసాగుతోందన్నారు.

తన జీవితంలో కోరుకున్నవి దక్కాయని తెలిపిన మోహన్ బాబు, రాజకీయాలు తనకు సెట్ కాలేదని, మిగిలిన జీవితం పిల్లలతో ఆనందంగా గడిపే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 560 సినిమాలు చేసిన తాను నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదని స్పష్టం చేశారు. తాను ఆవేశపరుడినైనప్పటికీ ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదని, కానీ తనను ఎంతో మంది మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా ట్రోలింగ్‌లపై స్పందించిన మోహన్ బాబు, ఇవన్నీ పట్టించుకోనని, ఇతరులను బాధ పెట్టేలా కామెంట్లు చేయడం ద్వారా ఎవరికి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ‘కన్నప్ప’ సినిమాలో అవకాశం రావడం దేవుడి దయ వల్లే జరిగిందని, శివుని ఆశీస్సులతో సినిమా పూర్తైందని చెప్పారు.

Read More


One thought on ““నన్ను మోసగించారు.. అప్ప‌ట్నుంచే ఆవేశం పెరిగింది” – మోహ‌న్ బాబు ఎమోష‌న‌ల్ జ‌ర్నీ

Comments are closed.