విక్రాంత్ మాస్సే రియల్ లైఫ్ ఇన్‌స్పిరేషన్: కాఫీ షాప్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు!

Vikrant Massey inspiring journey

సినీ ఇండస్ట్రీలో ఎదుగుదల అనేది ప్రతి ఒక్కరికీ తలచుకుంటే సాధ్యమయ్యే విష‌య‌మే కాదు. చాలా మందికి అది అనేక కష్టాల మధ్యే ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి కథే విక్రాంత్ మాస్సేదీ. ఒకప్పుడు తన కుటుంబాన్ని పోషించేందుకు కళాశాల చదువుతో పాటు కాఫీ షాప్‌లో పని చేసిన విక్రాంత్, నేడు బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకడిగా నిలిచాడు. ఎంతో కష్టపడి ఎదిగిన విక్రాంత్ ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తికి యజమాని.

విక్రాంత్ మాస్సే తన నటనా ప్రయాణాన్ని టెలివిజన్ సీరియల్స్‌తో ప్రారంభించాడు. ‘బాలికా వధూ’ (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో శ్యామ్ పాత్రతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించిన అతను, నెమ్మదిగా సినిమాల వైపు అడుగులు వేశాడు. ‘హసీన్ దిల్రుబా’, ‘12th ఫెయిల్’, ‘సెక్టార్ 36’ వంటి విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ తన అభినయ శైలితో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 16 ఏళ్ల వయస్సులో డ్యాన్స్ నేర్చుకుని కొరియోగ్రాఫర్‌గా కూడా పని చేసిన విక్రాంత్, నటుడిగా మారేందుకు చేసిన తపన ఇప్పుడు ఫలించింది.

ప్రస్తుతం ముంబైలో విలాసవంతమైన ఇంట్లో తన భార్యతో కలిసి నివసిస్తున్న విక్రాంత్, సుమారు రూ.26 కోట్ల నికర ఆస్తికి యజమాని. ఇటీవలే ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా సరసన నటించిన విక్రాంత్, ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలతో ముందుకెళ్తున్నాడు. తన నటనతో పాటు వ్యక్తిత్వం ద్వారా ఎన్నో హృదయాలను గెలుచుకుంటూ ఒక సాధారణ యువకుడి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన విక్రాంత్ మాస్సే జర్నీ ప్రతి అభిలాషి నటుడికి ప్రేరణగా నిలుస్తోంది.

Read More

One thought on “విక్రాంత్ మాస్సే రియల్ లైఫ్ ఇన్‌స్పిరేషన్: కాఫీ షాప్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు!

Comments are closed.