అమరావతి, ఏప్రిల్ 3: ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి CM Chandrababu Naidu కీలక సూచనలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆయన విమర్శించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం, పలు రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు.
ప్రవీణ్ మరణంపై సీఎం వ్యాఖ్యలు
ప్రవీణ్ మరణానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీలో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ కేసులో నిజాలను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “బాబాయ్ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి తరహా ఆరోపణలు మనపై వేయాలని కుట్రలు జరుగుతున్నాయి” అని ఆయన అన్నారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగాలపై కేబినెట్ నిర్ణయం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఆప్కాస్ ద్వారా దుర్వినియోగం చేశారని చంద్రబాబు ఆరోపించారు. టీటీడీలోనే 4,000 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని, ఈ విధానంలో సంస్కరణలు అవసరమని తెలిపారు. నియామకాలను పకడ్బందీగా నిర్వహించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
స్వర్ణ గ్రామం కార్యక్రమం
రాజ్యధాని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పల్లెనిద్ర కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. అధికారులు మూడు రోజులు, రెండు రాత్రులు గ్రామాల్లో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి పల్లెనిద్ర, పల్లె వెలుగు, స్వర్ణ గ్రామం అనే పేర్లను పరిశీలనలో పెట్టాలని చెప్పారు.
సంక్షేమ పథకాలపై దృష్టి
ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. అయితే, సరైన ప్రచారం లేకపోవడం వల్ల ప్రజలకు ఈ విషయాలు సరిగ్గా తెలియడం లేదని చెప్పారు. కేంద్రమంత్రి కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్, విజన్ 2047 అంశాలపై కేబినెట్లో చర్చించామని ఆయన వెల్లడించారు.
ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై చర్చ
రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఋషికొండ ప్యాలెస్‌ను ఉపయోగించుకునే విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ భవనాన్ని సందర్శించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని సీఎం సూచించారు.
Read More : రెడ్ బుక్ పేరిట వైసీపీ నాయకుల్లో భయాందోళనలు..

One thought on “మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు”
Comments are closed.