అక్కినేని కోడలు, నటుడు నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ ఎప్పుడూ తన అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా, వోగ్ బ్యూటీ స్కోప్‌తో జరిగిన ఇంటర్వ్యూలో, ఆమె తన అందం రహస్యాలు, చర్మ సంరక్షణ పద్ధతుల గురించి వివరించింది. “అసలైన అందం మనసు ఆనందంగా ఉన్నప్పుడే బయటపడుతుంది. ఆత్మవిశ్వాసం మనను మరింత అందంగా చూపిస్తుంది” అని శోభిత అన్నారు. ఆమె ట్రెడిషనల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌కే ప్రాధాన్యం ఇస్తానని, ఇంట్లో లభించే సహజ ఉత్పత్తులతోనే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతానని చెప్పింది.
చర్మ సంరక్షణలో ప్రత్యేకంగా చెప్పదగ్గది, తన పెదవుల పొడిబారడం సమస్యను అధిగమించేందుకు ఎన్నో రకాల లిప్ బామ్‌లు, లిప్ మాస్క్‌లు ప్రయత్నించిందని, కానీ అంతకు మించిన పరిష్కారం నెయ్యి అని తెలుసుకుందట. నెయ్యి రాస్తే పెదవులకు తేమ అందుతుందని, స్వభావిక రంగును ఇస్తుందని ఆమె చెప్పింది. చర్మం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరి నూనెను వాడితే, మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుందని, దద్దుర్లు, దురద నివారిస్తుందని అన్నారు. తన జుట్టు పొడిబారినప్పుడు కొబ్బరి నూనెతో మర్దన చేస్తానని, మైగ్రేన్ సమస్యనూ దాని ద్వారా తగ్గించుకున్నానని తెలిపారు.
శోభిత తన ఐబ్రోస్‌కి చిన్నప్పటినుంచి ఆముదం నూనె వాడుతూ వచ్చినట్లు తెలిపారు. రోజువారీ మేకప్‌లో లిప్ బామ్, ఐ లైనర్, కాటుక తప్పనిసరి అని, కెమెరా ముందుకు వెళ్లినప్పుడు బ్లూ మేకప్‌ను ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు. సహజసిద్దమైన అందాన్ని ప్రదర్శిస్తూ, సహజ ఉత్పత్తులతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శోభిత అందం వెనుకున్న రహస్యాన్ని వెల్లడించారు.

One thought on “అందం లోపల నుంచే మొదలవుతుంది – శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్”
Comments are closed.