ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించిన అనంతరం పెద్ద సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చి జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో జయోత్సవాలు ఉద్రిక్తతకు దారి తీసాయి. హైదరాబాద్ దిల్సుఖ్‌నగర్, కరీంనగర్‌లలో అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ నేతల విమర్శలు
ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా, ‘‘భారత జట్టు విజయాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటు. అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధం’’ అని మండిపడ్డారు. బండి సంజయ్ కూడా పోలీసుల తీరుపై ధ్వజమెత్తుతూ, ‘‘కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారు? భారత విజయాన్ని సంబరంగా జరుపుకోవడం మతపరమైన సమస్యగా ఎలా మారుతుంది? శాంతి భద్రతల సమస్యల సృష్టిపై పోలీసుల వైఖరిని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలి’’ అంటూ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, టీమిండియా విజయం సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు కొనసాగుతున్నాయి.

One thought on “ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం: సంబరాల్లో అల్లర్లు, లాఠీచార్జీపై వివాదం”
Comments are closed.